Boat capsizes : బీహార్‌లో మునిగిన పడవ…10 మంది పిల్లలు గల్లంతు

బీహార్ రాష్ట్రంలో గురువారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ముజప్ఫర్ నగర్ జిల్లాలోని బాగమతి నదిలో 30 మంది పిల్లలతో వెళుతున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. సహాయ సిబ్బంది, గత ఈతగాళ్లు రంగంలోకి దిగి 20 మంది పిల్లల్ని రక్షించారు....

Boat capsizes

Boat capsizes : బీహార్ రాష్ట్రంలో గురువారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ముజప్ఫర్ నగర్ జిల్లాలోని బాగమతి నదిలో 30 మంది పిల్లలతో వెళుతున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. సహాయ సిబ్బంది, గత ఈతగాళ్లు రంగంలోకి దిగి 20 మంది పిల్లల్ని రక్షించారు. పడవ ప్రమాదానికి కారణాలు తెలియలేదు. కొంతమంది పిల్లలు నదిలో గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

Viral Fever Cases : ఢిల్లీని వణికిస్తున్న జ్వరాలు…డెంగీ, స్వైన్ ఫ్లూ, వైరల్ ఫీవర్ కేసులు

ఈ ఘటనతో బాగమతి నది వద్ద ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను రక్షించగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న బీహార్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.