Bombay HC: కేంద్ర మంత్రి అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఉక్కు పాదం.. కూల్చివేయాలంటూ ఆదేశం

వాస్తవానికి అదనపు నిర్మాణాలను రెగ్యూలరైజ్ చేయాలని జూన్‭లో బీఎంసీని నారాయణ రాణె ఆశ్రయించారు. దీనిని బీఎంసీ తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ నిర్మాణాలు కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌(సీఆర్‌జడ్‌), ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలడంతో కూల్చివేతకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Bombay HC: కేంద్ర మంత్రి నారాయణ్ రాణె అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని జుహులో ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారని రుజువు కావడంతో ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. అంతే కాకుండా ఆయనపై 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

కొద్ది రోజుల క్రితమే నారాయణ్ రాణేకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసు పంపింది. అక్రమ కట్టడాలు సహా, ఇతర మార్పులకు సంబంధించి ఆ నోటీసులో ప్రస్తావించింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, సెక్షన్ 351 ప్రకారం అనుమతులు లేకుండా భవన నిర్మాణాల డిజైన్ మార్చినందుకు, సమాచారం లేకుండా నిర్మాణం పెంచినందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

వాస్తవానికి అదనపు నిర్మాణాలను రెగ్యూలరైజ్ చేయాలని జూన్‭లో బీఎంసీని నారాయణ రాణె ఆశ్రయించారు. దీనిని బీఎంసీ తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ నిర్మాణాలు కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌(సీఆర్‌జడ్‌), ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలడంతో కూల్చివేతకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Lumpy Skin Disease: 57,000 పశువుల మృతిపై భారీ ఆందోళన చేపట్టిన బీజేపీ

ట్రెండింగ్ వార్తలు