Nisith Pramanik: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి.. బాంబు వేశారన్న నిసిత్ ప్రమాణిక్

సాహిబ్‌గంజ్ ప్రాంతంలోని ఎన్నికల కార్యాలయానికి నిసిత్ ప్రమాణిక్ వెళ్లాలనుకున్నారు.

Nisith Pramanik

Nisith Pramanik – BJP: కేంద్ర సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని కూచ్‌బిహార్ జిల్లాలో కొందరు దాడి చేశారు. దీనిపై నిసిత్ ప్రామాణిక్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) వారే తన కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. అయితే, ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ అంటోంది.

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఈ సమయంలో సాహిబ్‌గంజ్ ప్రాంతంలోని ఎన్నికల కార్యాలయానికి నిసిత్ ప్రమాణిక్ వెళ్లాలనుకున్నారు. ఆయన అక్కడకు చేరుకుంటున్న నేపథ్యంలో కాన్వాయ్ పై కొందరు రాళ్లురువ్వినట్లు తెలుస్తోంది.

దీనిపై నిసిత్ ప్రమాణిక్ స్పందిస్తూ… పంచాయతీ ఎన్నికల వేళ ఆ కార్యాలయం వద్ద టీఎంసీ అవకతవకలు పాల్పడుతోందని తెలుసుకుని వెళ్లానని చెప్పారు. ఆ కార్యాలయం వద్దకు చేరుకోగానే కొందరు తన కాన్వాయ్ పై రాళ్లు రువ్వారని చెప్పారు. తమ వైపుగా బాంబులు కూడా వేశారని తెలిపారు. పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

Wrestlers Protest: అందుకే మేమంతా సైలెంట్ అయిపోయాం: రెజ్లర్ సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవర్త్