Karnataka: కాంగ్రెస్ ‘PayCM’ కార్యక్రమంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం

పేటీఎం తరహాలో.. పేసీఎం అంటూ వెలసిన ఈ వాల్ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వంలోని ఏ శాఖలో పనులు చేపట్టినా పాలకులు 40శాతం కమీషన్ తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు అంటించారు. పేసీఎం పోస్టర్లపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే 40శాతం కమీషన్ గవర్నమెంట్ అంటూ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్ ద్వారా బొమ్మై ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది.

Bommai dissatisfied with paycm program

Karnataka: 40 శాతం కమిషన్లు లేకుండా బొమ్మై ప్రభుత్వం ఏ పనీ చేయదంటూ ‘PayCM’ (పేటీఎం లాగ పేసీఎం) అనే కార్యక్రమానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రారంభించింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి విస్త్రృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అచ్చం పేటిఎం లాగే ఒక క్యూఆర్ కోడ్.. అందులో సీఎం బొమ్మై ఫొటోగ్రాఫ్ పెట్టి.. పైన ‘పేసీఎం’ అని టైటిల్ పెట్టారు. దాని కింద ‘40 శాతం అనుమతించబడును’ అంటూ ప్రభుత్వంలో 40 శాతం కమిషన్ జరుగుతోందని ప్రస్తావించారు.

కాగా, కాంగ్రెస్ చేపట్టిన ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి బొమ్మై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలని, కానీ అలా చేయకుండా తప్పుడు ప్రచారం చేయడం సరి కాదని అన్నారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ‘‘పేసిఎం అనే కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ మురికి రాజకీయాలకు పాల్పడుతోంది. ఏదైనా సమస్య ఉంటే నేరుగా కలిసి మాట్లాడాలి. దానిపైన డాక్యూమెంట్ ఇస్తే, ప్రభుత్వం విచారణ చేస్తుంది. కానీ వాళ్లు ఎలాంటి ఆలోచనా లేకుండా ఇంటికి వచ్చారు. అవాస్తవాలతో ప్రచారం చేస్తున్నారు. వాళ్ల నైతిక స్థాయి దిగజారింది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు’’ అని అన్నారు.

ఇక పేసీఎం కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే.. పేటీఎం తరహాలో.. పేసీఎం అంటూ వెలసిన ఈ వాల్ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వంలోని ఏ శాఖలో పనులు చేపట్టినా పాలకులు 40శాతం కమీషన్ తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు అంటించారు. పేసీఎం పోస్టర్లపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే 40శాతం కమీషన్ గవర్నమెంట్ అంటూ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్ ద్వారా బొమ్మై ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది.

Lalu Yadav: నితీశ్‭తో కలిసి సోనియాను కలవనున్న లాలూ.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిస్తామని ప్రకటన