Lalu Yadav: నితీశ్‭తో కలిసి సోనియాను కలవనున్న లాలూ.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిస్తామని ప్రకటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లాలూ నిప్పులు చెరిగారు. బిహార్ నుంచి బీజేపీ ప్రభుత్వం పోయిందని, అలాగే 2024లో ఈ దేశం నుంచి కూడా పోతుందని లాలూ అన్నారు. ఈ విషయం అమిత్ షాకు తెలిసే.. బిహార్‭ను జంగిల్ రాజ్ అంటూ ఏవేవో ప్రచారం చేస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‭లో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు? నిజానికి అమిత్ షా ఉన్నప్పుడు గుజరాత్ జంగిల్ రాజ్ లాగ ఉండేదని లాలూ విమర్శించారు.

Lalu Yadav: నితీశ్‭తో కలిసి సోనియాను కలవనున్న లాలూ.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిస్తామని ప్రకటన

We will uproot BJP says Lalu Yadav

Lalu Yadav: బిహార్ రాజకీయ దిగ్గజ నేతలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. ఇద్దరూ కలిసి తొందరలోనే కాంగ్రెస్ తాత్కాలిక అధినేత సోనియాగాంధీని కలవనున్నారు. సెప్టెంబర్ 25న ఢిల్లీకి వెళ్లి, ఆమె నివాసంలోనే సమావేశం కానున్నట్లు శనివారం లాలూ యాదవ్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీపై పోరు ఉదృతం చేసేందుకు దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేసే పనిని మరింత వేగం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న లాలూ.. శనివారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ ‘‘అవును.. మేము వారిని (బీజేపీ) కూకటివేళ్లతో పెకిలిస్తాం. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నితీశ్ కుమార్, నేను కలిసి సోనియాను కలవబోతున్నాం. ప్రతిపక్షాలన్నింటిని ఒక గొడుకు కిందకు తీసుకురావడానికి మా సర్వశక్తులు ఒడ్డుతాం’’ అని అన్నారు.

India vs Australia T20 Match: రేపు ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. స్టేడియంలోకి ఆ వస్తువులు తీసుకెళ్లొద్దు..

ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లాలూ నిప్పులు చెరిగారు. బిహార్ నుంచి బీజేపీ ప్రభుత్వం పోయిందని, అలాగే 2024లో ఈ దేశం నుంచి కూడా పోతుందని లాలూ అన్నారు. ఈ విషయం అమిత్ షాకు తెలిసే.. బిహార్‭ను జంగిల్ రాజ్ అంటూ ఏవేవో ప్రచారం చేస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‭లో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు? నిజానికి అమిత్ షా ఉన్నప్పుడు గుజరాత్ జంగిల్ రాజ్ లాగ ఉండేదని లాలూ విమర్శించారు.

విపక్షాలను ఏకం చేసే పనిలో నితీశ్ ఇప్పటికే బిజీ బిజీగా ఉన్నారు. కేజ్రీవాల్, రాహుల్, అఖిలేష్, పవార్ వంటి నేతల్ని ఆయన ఇప్పటికే పలుమార్లు కలుసుకుని చర్చించారు. ఇక ఆయనకు లాలూ తోడయ్యారు. నిజానికి 2015లో ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీ చేసి బీజేపీని ఓడించినప్పుడే విపక్షాల ప్రధాని అభ్యర్థి నితీశేనని వ్యాఖ్యానాలు వినిపించాయి. అయితే ఆయన ఆర్జేడీకి టాటా చెప్పి బీజేపీతో చేతులు కలపడంతో అలాంటి ఊహాగానాలు ఆగిపోయాయి.

Congress President Elections : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో శశిథరూర్ .. నామినేషన్ పత్రాలు తీసుకున్నట్లు వెల్లడి