PFI Conspiracy: బీహార్‌లో ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర పన్నింది.. ఈడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) పేర్కొంది. కేరళలో గురువారం అరెస్టయిన పీఎఫ్‌ఐ సభ్యుడు షఫీక్ పాయెత్‌ రిమాండ్ నోట్‌లో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

PFI Conspiracy: బీహార్‌లో ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర పన్నింది.. ఈడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

PM Modi

PFI Conspiracy: పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) పేర్కొంది. కేరళలో గురువారం అరెస్టయిన పీఎఫ్‌ఐ సభ్యుడు షఫీక్ పాయెత్‌ రిమాండ్ నోట్‌లో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూలై 12న ప్రధాని నరేంద్ర మోదీ పాట్నా పర్యటించారు. ఈ సందర్భంగా దాడి చేసేందుకు శిక్షణా శిబిరాన్ని పీఎఫ్ఐ ఏర్పాటు చేసిందని ఈడీ తన విచారణ సమయంలో గుర్తించింది. మరోవైపు మనీలాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పర్వేజ్ అహ్మద్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ ముఖీత్ లను ఈడీ అధికారులు విచారించారు. ఈ క్రమంలో పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థల ఖాతాల్లో రూ.120 కోట్లకు‌పైగా జమ అయినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. స్వదేశీ, విదేశాల నుండి అనుమానిత సంస్థలు వ్యక్తుల నుంచి నగదు జమ అయినట్లు ఈడీ గుర్తించింది. ఎక్కువగా నగదు రూపంలో దేశవ్యాప్తంగా అల్లర్లు, ఉగ్రవాద కార్యకలాపాలను సృష్టించడానికి నిధులను మార్చడానికి ప్రయత్నాలు జరిగినట్లు ఈడీ పేర్కొంది.

PFI furious due to NIA’s action: కేరళలో విధ్వంసం సృష్టించిన పీఎఫ్‌ఐ కార్యకర్తలు.. పలువురి అరెస్టు

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కదలికలపై దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు PFI కుట్ర పన్నినట్లు తెలియడంతో ఈవిషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అలజడి సృష్టించేందుకు పీఎఫ్ఐ కుట్రపన్నుతుందన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. పీఎఫ్‌ఐ ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 105 మందిని అరెస్ట్‌ చేశారు. ఎన్ఐఏ దాడుల తర్వాత పీఎఫ్‌ఐ ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ దృష్టి సారించింది.

PFI: 15 రాష్ట్రాలు, 93 ప్రదేశాల్లో ఎన్ఐఏ ముమ్మర సోదాలు.. 45 మంది అరెస్ట్

ఇదిలాఉంటే మరోవైపు దేశంలో ఎన్ఐఏ, ఈడీ అధికారుల దాడులను నిరసిస్తూ కేరళలో బంద్ కూడా నిర్వహించారు. కేరళలో పీఎఫ్ఐ నిర్వహించిన బంద్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కేరళలో ఆర్టీసీ బస్సులు, పలు ప్రైవేట్ వాహనాలు ద్వంసం కావడంతో పాటు అనేక మంది సామాన్య ప్రజలకు తీవ్రగాయాలయ్యాయి. ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్న పీఎఫ్ఐ నాయకులను విచారిస్తున్న సమయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.