PFI furious due to NIA’s action: కేరళలో విధ్వంసం సృష్టించిన పీఎఫ్‌ఐ కార్యకర్తలు.. పలువురి అరెస్టు

కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొచ్చిలో విధ్వంసానికి పాల్పడిన ఘటనలో ఐదుగురు పీఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుకాణాలు మూసేయాలని వ్యాపారులను పీఎఫ్‌ఐ కార్యకర్తలు బెదిరించారు. అందుకు ఒప్పుకోకపోతే బలవంతంగా మూసేయించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపేందుకు యత్నించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళనలకు పిలుపు ఇచ్చినట్లు ఓ పీఎఫ్‌ఐ కార్యకర్త తెలిపాడు.

PFI furious due to NIA’s action: కేరళలో విధ్వంసం సృష్టించిన పీఎఫ్‌ఐ కార్యకర్తలు.. పలువురి అరెస్టు

PFI furious due to NIA's action

PFI furious due to NIA’s action: నేరపూరిత కార్యకలాపాలకు పాడ్పడుతున్నారన్న ఆరోపణలపై 15 రాష్ట్రాల్లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు చెందిన కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేసి, అరెస్టు చేయడంతో కేరళలో పీఎఫ్‌ఐ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. కొచ్చిలో దుకాణాలను ధ్వంసం చేస్తూ, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ రెచ్చిపోయారు. అంతేగాక, కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి.

కొచ్చిలో విధ్వంసానికి పాల్పడిన ఘటనలో ఐదుగురు పీఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుకాణాలు మూసేయాలని వ్యాపారులను పీఎఫ్‌ఐ కార్యకర్తలు బెదిరించారు. అందుకు ఒప్పుకోకపోతే బలవంతంగా మూసేయించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపేందుకు యత్నించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళనలకు పిలుపు ఇచ్చినట్లు ఓ పీఎఫ్‌ఐ కార్యకర్త తెలిపాడు.

కొళ్లాం జిల్లాలో ఇద్దరు పోలీసులపై పీఎఫ్‌ఐ కార్యకర్తలు దాడికి దిగారు. కేరళలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇతర వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. కన్నూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద పెట్రోల్ బాంబు విసిరారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా