Breakthrough Virus : వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల కరోనా కేసులు పెరుగుతున్నాయ్!

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కొందరు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు 2.6 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు.

Breakthrough Virus

Breakthrough Virus : వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కొందరు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు 2.6 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు. ఈ కేసులు కేరళలో అధికంగా బయటపడుతున్నాయి. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తైంది. అయినప్పటికీ ఇక్కడ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

దేశంలో వ్యాక్సిన్ తోలి డోసు తీసుకున్న వారిలో ఒక లక్ష 70 వేల మందికి కరోనా సోకింది. రెండు డోస్ తీసుకున్న వారిలో 87 వేల మందికి కరోనా సోకింది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 40 వేలమందికి రెండు డోస్ ల టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకింది. బ్రేక్ త్రు ఇన్‌ఫెక్షన్‌లు (టీకా తీసుకున్న తర్వాత వచ్చే వైరస్) పెరగడం కలవరపెట్టే అంశమే అయినా ప్రమాదం ఏమి లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకినా ఆసుపత్రిలో చేరే పరిస్థితి రావడం లేదని, తేలికగా కోలుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. టీకా తీసుకున్నా కోవిడ్ నిబంధనలు పాటిస్తే కేసులు రాకుండా చూడొచ్చని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడే అవకాశాలు, రీ-ఇన్‌ఫెక్షన్‌, వైరస్‌ ఉత్పరివర్తనాలతో పాటు కొత్త వేరియంట్లపై ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమ్ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం అధ్యయనం చేస్తుంది(INSACOG).

ఇక దేశంలో ఇప్పటివరకు 57 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణి జరిగింది. వీరిలో 44.5 కోట్లమందికి మొదటి డోస్, 12.5 కోట్ల మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ డ్రైవ్ వేగవంగంగా నడుస్తుంది. ఇక కరోనా కేసులు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయి.