ట్రెండ్లీ, రిచ్ మ్యారేజ్ : ఉల్లి వెల్లుల్లి దండలు మార్చుకున్న వధూవరులు

  • Publish Date - December 14, 2019 / 04:23 AM IST

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఉల్లి పాయలు..వెల్లుల్లి పాయలతో తయారు చేసిన దండల్ని మార్చుకున్నారు. ఉల్లి వెల్లుల్లి పాయలు రేట్లు ఆకాశంలో విహరిస్తున్నా సందర్భంగా..పెళ్లి కూతురు పెళ్లికొడుకు పూల దండలకు బదులు.. ఉల్లి వెల్లుల్లి పాయల దండలు మార్చుకున్నారు. 
అంతేకాదు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వారికి ఉల్లిపాయల్ని గిఫ్టులుగా ఇచ్చారు. 

ఈ పెళ్లికి హాజరైన సమాజ్ వాదీ పార్టీ నేత కమల్ పటేల్ మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో ఉల్లి రూ.120కి పైగా అమ్ముతోంది. దీంతో ప్రజలు ఉల్లిపాయల్ని బంగారం కంటే ఎక్కువగా భావిస్తున్నారని అన్నారు. ఈ పెళ్లిలో వధూవరులు ఉల్లిపాయలు, వెల్లుల్లి దండలను మార్చుకుని వాటి రేట్లు ఎలా ఉన్నాయో ప్రదర్శించారని అన్నారు. 

మరో ఎస్పీ నేత సత్య ప్రకాష్ మాట్లాడుతూ..ఉల్లి రేట్లు అధికంగా ఉన్నందుకు వధూవరులిద్దరు ఈ రకంగా తమ నిరసనను తెలిపారని అన్నారు. ఉల్లికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలను మా పార్టీ నిరసనలు చేపడుతోందని తెలిపారు.