Uttar Pradesh : ఫోటోగ్రాఫర్ లేడని పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న వధువు

పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు వీడియోలు ఉండాలి. అందుకనే పెళ్లిలో ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉండి మధుర క్షణాలను నిక్షిప్తం చేస్తుంటారు. పెళ్లికి ఫోటో‌గ్రాఫర్‌ను తీసుకు రాలేదనే కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక వధువు.

Uttar Pradesh :  పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు వీడియోలు ఉండాలి. అందుకనే పెళ్లిలో ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉండి మధుర క్షణాలను నిక్షిప్తం చేస్తుంటారు. పెళ్లికి ఫోటో‌గ్రాఫర్‌ను తీసుకు రాలేదనే కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక వధువు.

కాన్పూర్ దేహత్ జిల్లా మంగళ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసిచే రైతు కుమార్తెకు భోగ్నిపూర్ లో నివసిస్తున్న వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి కూతురు కుటుంబం జైమాల్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. వరుడు ఉరేగింపుతో రాగానే అందరూ కలిసి ఆహ్వానం పలికి కళ్యాణ మండపానికి చేరుకున్నారు.  మరికొద్దిసేపట్లో జైమాల్ జరగాల్సి ఉండగా అబ్బాయి తరుఫు వాళ్ల బృందంలో ఫోటో గ్రాఫర్,వీడియో గ్రాఫర్ లేకపోవటం గమనించింది వధువు.  దీంతో ఆమెకు కోపం వచ్చింది.

తను ఆ పెళ్లి చేసుకోనని తేగేసి చెప్పింది. కళ్యాణ మండపం నుంచి దిగి పక్క ఇంటికి వెళ్లి అక్కడే కూర్చుంది. ఆమెను ఎంత బతిమలాడినా ఒప్పుకోలేదు. నాతో ఈరోజు జరిగే పెళ్లి గురించే పట్టించుకోని వాడు రేపు జీవితంలో నాగురించి పట్టించుకుంటాడా… నన్ను జీవితాంతం సంతోషంగా ఉంచగలుగుతాడా   అంటూ ప్రశ్నించింది. వ్యవహారం చివరకు పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసుల మధ్యవర్తిత్వంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్న కానుకలు వెనక్కు తిరిగి ఇచ్చేశారు. అనంతరం పెళ్లి కూతురు లేకుండానే వరుడు వెనక్కి తిరిగి వెళ్లాడు.

Also Read : K Lakshman: యూపీ నుంచి రాజ్యసభ బరిలోకి కే.లక్ష్మణ్

ట్రెండింగ్ వార్తలు