Wrestler protest: రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్.. IOAని ఆశ్రయించిన రెజ్లర్లు

బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్‌లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని ఐఎంఏ అధ్యక్షురాలు పీటీ ఉషను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Wrestler protest: వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం విధితమే. బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువురు వీరికి సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటిస్తున్నారు. రెజ్లర్ల ఆరోపణలను కేంద్ర క్రీడాశాఖ సీరియస్ గా తీసుకోవటంతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గురువారమే రాజీనామా చేస్తారని భావించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.

Wrestler protest: కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. మద్దతు తెలిపిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ..

మహిళా రెజర్లపై వేధింపులకు పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడనని, నేను ఎన్నుకోబడిన వ్యక్తిని, ఎవరి దయతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిలో లేనని శరణ్ సింగ్ స్పష్టం చేశారు. నేను దేశం విడిచిపోవచ్చని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అమిత్ షాను కలిశారా అని మీడియా ప్రశ్నించగా.. కేంద్ర హోమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ లో ఎవరిని నేను కలవలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ తెలిపారు. అయితే, సాయంత్రం 4 లేదా 5గంటల సమయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు.

Wrestler protest

బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్‌లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పునియాలు ఐఎంఏ అధ్యక్షురాలు పీటీ ఉషను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు