India Pak (1)
India-Pak Soldiers భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. అట్టారీ-వాఘా సరిహద్దుతో పాటు గుజరాత్, రాజస్తాన్ లో భారత్ – పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
పంజాబ్ లోని అమృత్సర్ దగ్గర ఉండే అట్టారీ- వాఘా సరిహద్దు వద్ద పాక్ సైనికులకు భారత జవాన్లు మిఠాయిలు పంచి పెట్టారు. కశ్మీర్ లోని కశ్మీర్ టీట్వాల్లోని సరిహద్దు ఒంతెనపైనే రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకుని దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
కాగా, ప్రతి ఏటా హోలీ, దీపావళి, రంజాన్ పండుగల వేళ రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే.
ALSO READ నెవర్ గివప్.. ఎలన్ మస్క్‌పై Anand Mahindra ప్రశంసల వర్షం, నెటిజన్లకు లైఫ్ లెసన్