Drone
Drone : సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుందా? అంటే.. తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత సైన్యంపైకి ఉసిగొలుపుతుంది పాక్. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద నేతలకు ఆశ్రయం కల్పిస్తూ..ప్రపంచ దేశాల హాచ్చరికలను బేఖాతరు చేస్తుంది. ఇక గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో అశాంతికి బీజం వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇందుకు తాజాగా భారత్ సరిహద్దులో దొరికిన డ్రోన్ నిదర్శనం.
చదవండి : Israel Drones : భారత ఆర్మీ చేతికి అధునాతన ఇజ్రాయెల్ డ్రోన్లు..LAC వద్ద మొహరింపు
చైనా తయారు చేసిన డ్రోన్.. పాకిస్తాన్ మీదుగా పంజాబ్ సరిహద్దుల్లోకి వచ్చింది. దానిని గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు టెక్నాలజీని ఉపయోగించి కిందకు దింపారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఘటనాస్థలికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పరిసరాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల దగ్గరుండి సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
చదవండి : Predator Drones : రూ.21వేల కోట్ల డీల్.. 30 డ్రోన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ
చదవండి : Drones Drop Food, Water : కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు సరఫరా..ఎందుకంటే?