Predator Drones : రూ.21వేల కోట్ల డీల్.. 30 డ్రోన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ

భారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Predator Drones : రూ.21వేల కోట్ల డీల్.. 30 డ్రోన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ

Predator Drones

Predator Drones : భారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో డ్రోన్ల కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే, అది రక్షణ మంత్రి నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌కు పంపబడుతుంది. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు తుది ఆమోదం తెలిపేందుకు కేబినెట్ కమిటీకి పంపుతారు. డ్రోన్లు అధునాతన వ్యవస్థలు, ఆయుధాల ప్యాకే జీలతో వస్తాయని, దీర్ఘ శ్రేణి నిఘా, కచ్చితమైన దాడులను చేయగల సామర్థ్యం వీటికి ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

డ్రోన్ జాబితాలో MQ-9B సీగార్డియన్/స్కైగార్డియన్ వేరియంట్లు ఉన్నాయి. ఒక వేళ ఈ డీల్‌ కుదురితే భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఒక్కొక్కటి కస్టమైజ్డ్ స్పెసిఫికేషన్లతో 10 డ్రోన్లను పొందవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం గతేడాది అమెరికా నుంచి లీజుకు తీసుకున్న రెండు నిరాయుధ సీగార్డియన్ డ్రోన్లను భారత నావికాదళం ఇప్పటికే ఉపయోగిస్తోంది.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

ఆయుధ వ్యవస్థలను లీజుకు తీసుకునే ఎంపిక డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020, డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్ 2009 రక్షణ శాఖకు కల్పించింది. లీజుకు తీసుకోవడమా కొనుగోలు చేయడమా అనే సందిగ్ధతపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. కొన్నేళ్లుగా భారత సాయుధ దళాలు నిఘా అవసరాల కోసం అమెరికా వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. భారత నావికాదళం ఇప్పటికే తొమ్మిది P-8I దీర్ఘ-శ్రేణి నిఘా విమానాలను ఉపయోగిస్తోంది. ఈ డీల్‌ కుదిరితే రాబోయే కొన్నేళ్లలో డ్రోన్‌లతో పాటు మరో 9 లాంగ్ రేంజ్ సర్విలెన్స్ ప్లేన్లు భారత్ చేతికి అందనున్నాయి.