Eid-Ul-Fitr : రంజాన్‌ పర్వదినాన.. స్వీట్లు పంచుకున్న పాక్‌ రేంజర్లు-బీఎస్‌ఎఫ్‌‌ జవాన్లు

Eid-Ul-Fitr : రంజాన్‌ పర్వదినాన దేశ సరిహద్దుల్లోని జవాన్లు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Eid-Ul-Fitr : రంజాన్‌ పర్వదినాన దేశ సరిహద్దుల్లోని జవాన్లు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది, పాక్‌ రేంజర్లు స్వీట్లు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాక్‌ రేంజర్లు, సరిహద్దు బలగాలు ఒకరినొకరు స్వీట్లు పంచుకున్నారని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లోని ఆర్‌ఎస్‌ పురా, సాంబా, కథువా, అఖ్నోర్‌ సరిహద్దు అవుట్‌ పోస్టుల వద్ద మిఠాయిలు పంచుకున్నట్టు వెల్లడించారు.

ముందుగా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పాక్‌ రేంజర్లకు స్వీట్లు ఇచ్చి ఈద్‌ శుభాకాంక్షలు తెలిపారు. దాంతో స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నట్టు తెలిపారు. దేశ సరిహద్దుల్లో దాడులను నియంత్రించడమే కాకుండా శాంతియుత, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడంలో బీఎస్‌ఎఫ్‌ ఎప్పుడూ ముందుగా ఉంటుందని తెలిపారు. స్వీట్లు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఇరుదేశాల సరిహద్దు బలగాల మధ్య శాంతియుత వాతావరణాన్ని, స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవచ్చునని సంధు తెలిపారు.

Read Also : Electric Shock : భర్తకు కరెంట్ షాక్‌…కాపాడే క్రమంలో భార్యకూ షాక్.. ఇద్దరూ మృతి

ట్రెండింగ్ వార్తలు