Electric Shock : భర్తకు కరెంట్ షాక్‌…కాపాడే క్రమంలో భార్యకూ షాక్.. ఇద్దరూ మృతి

అరకులోయ కరెంట్ క్వార్టర్స్‌లో దంపతులు నివసాముంటున్నారు. సర్వీస్ వైర్‌పై దుస్తులు ఆరవేస్తుండగా భర్తకు షాక్ కొట్టింది. ఇది గమనించిన భార్య.. భర్తను కాపాడే ప్రయత్నం చేసింది.

Electric Shock : భర్తకు కరెంట్ షాక్‌…కాపాడే క్రమంలో భార్యకూ షాక్.. ఇద్దరూ మృతి

Electric Shock

Updated On : May 3, 2022 / 3:55 PM IST

electric shock : అల్లూరి జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్ ఇద్దరి ప్రాణం తీసింది. అరకులోయలో కరెంట్‌ షాక్ తో భార్యాభర్తలు మృతి చెందారు. భర్తకు కరెంట్ షాక్ కొట్టింది. భర్తను కాపాడబోయి భార్య కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు.

అరకులోయ కరెంట్ క్వార్టర్స్‌లో దంపతులు నివసాముంటున్నారు. సర్వీస్ వైర్‌పై దుస్తులు ఆరవేస్తుండగా భర్తకు షాక్ కొట్టింది. ఇది గమనించిన భార్య.. భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భార్యకు కూడా కరెంట్ షాక్ తగిలింది.

Tragedy : విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భార్యాభర్తలను గమనించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో దంపతులిద్దరూ ఘటనాస్థలంలో మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.