Rajasthan Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌తో పొత్తు.. క్లారిటీ ఇచ్చిన బీఎస్పీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎస్పీ కూడా సన్నాహాలు చేసింది. మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ సమన్వయకర్తగా ఆకాష్ ఆనంద్ నియమితులయ్యారు.

BSP Alliance with Sachin Pilot: సొంత పార్టీతోనే కయ్యం పెట్టుకుని, ప్రస్తుతం అంతంతమాత్రంగానే పార్టీతో నడుస్తున్న సచిన్ పైలట్ మీద బహుజన్ సమాజ్ పార్టీ కన్నేసినట్టే కనిపిస్తోంది. పైలట్‌ను ముఖ్యమంత్రి చేయాలని, లేదంటే గుర్జర్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని బీఎస్పీ నేత మలూక్ నగర్ పెద్ద ప్రకటన చేశారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీలకు సమ దూరం పాటించే బీఎస్పీ.. కాంగ్రెస్ నేతకు అనుకూలంగా మాట్లాడటం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని అంటున్నారు. సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన పైలట్ ను తమ వైపుకు తిప్పుకుని, ఆయనతో పొత్తుతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని బీఎస్పీ భావిస్తోంది. అయితే అది వాస్తవంలో జరిగేలా కనిపించడం లేదు.
మలూక్ నగర్ వ్యాఖ్యలను అంత సులభంగా తీసుకోలేం. ఎందుకంటే ఆయన కూడా గుర్జర్ కమ్యూనిటీనే. పైగా సచిన్ పైలట్ తో ఆయన ఇంతకు ముందు సమావేశమై రాజకీయాలపై చర్చించారు. ఆ తర్వాతే ఇలాంటి ప్రకటనలు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. రాజస్థాన్‌లో వెనుకబడిన సమాజంలోని అతిపెద్ద నాయకుడు సచిన్ పైలట్ అని మలూక్ నగర్ అన్నారు. వెనుకబడిన సమాజానికి చెందిన నాయకులను కాంగ్రెస్ పక్కన పెడుతుందని మలూక్ విమర్శించారు.
Water Bicycle: అమెరికా శపథాన్ని నెరవేర్చిన కొండా.. చేవెళ్ల యువతతో అద్భుతం ఆవిష్కరణ
హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయ్యారని అన్న ఆయన.. సచిన్ పైలట్ తో అశోక్ గెహ్లాట్ సయోధ్యకు సూచన చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరు జరగనుందని అన్నారు. 2024లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని మలూక్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ వ్యూహం
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు సీట్లు దక్కనున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎస్పీ కూడా సన్నాహాలు చేసింది. మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ సమన్వయకర్తగా ఆకాష్ ఆనంద్ నియమితులయ్యారు. ‘సర్వజన్ హితాయ, సర్వజన్ సుఖాయ్ సంకల్ప్ యాత్ర’ ద్వారా ఆకాష్ ఆనంద్.. బీఎస్పీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. యాత్రలో దళితులు, ముస్లింలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అకృత్యాల అంశాన్ని లేవనెత్తుతూ ఓటర్లలో చెలరేగేందుకు ప్రయత్నించారు.