By-polls in 4 States : 4 రాష్ట్రాల్లో 5 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఏప్రిల్ 12న పోలింగ్!

నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, మహారాష్ట్రలలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.

By Poll To Asansol Ls Seat, Four Assembly Constituencies On April 12

By-polls in 4 States : నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, మహారాష్ట్రలలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ స్థానం, 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలోని ఖాళీలను కూడా ఉప ఎన్నికల ద్వారా భర్తీ చేయనుంది.

ఈసీ ప్రకటన ప్రకారం.. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 16న జరుగనుంది. తృణముల్ కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ శాసనసభ్యుడు బాబుల్ సుప్రియో రాజీనామా చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. పశ్చిమ బెంగాల్‌లోని బల్లిగంజ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్, బీహార్‌లోని బోచాహాన్, మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్‌లకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.

By Poll To Asansol Ls Seat, Four Assembly Constituencies On April 12

ఈ 5 ఉప ఎన్నికలకు మార్చి 17న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 17న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్లకు దాఖలుకు చివరి తేదీ మార్చి 24గా ఈసీ నిర్ణయించింది. నామినేషన్ల పరిశీలన మార్చి 25 వరకు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ మార్చి 28 వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 12న జరుగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు ఏప్రిల్‌ 16న వెల్లడి కానున్నాయి.

Read Also : AICC : రాజీనామా యోచనలో రాహుల్ ? ప్రియాంక, సీడబ్ల్యూసీ భేటీలో వెల్లడి ?