13 నియోజకవర్గాల ఉపఎన్నిక ఫలితాల్లో ఇండియా కూటమి అభ్యర్థుల హవా

దేశంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శనివారం వెల్లడవుతుండగా.. ఇడియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుంది.

bypoll results

INDIA alliance : దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. తాజాగా ఆ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడవుతున్నాయి. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే భారత కూటమి (INDIA alliance) అభ్యర్థులు విజయం సాధించగా.. మరో ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీని ఇచ్చిన విసయం తెలిసిందే.

Also Read : బిహార్‌లో తప్పిన ప్రమాదం.. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతి.. పర్యాటకులు ఎలా ఒడ్డుకు చేరారంటే..

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆప్, డీఎంకే అభ్యర్థులు బరిలో నిలిచారు. పంజాబ్ లోని జలందర్ వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మొహిందర్ భగత్ 23వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ వెనుకబడి ఉంది.

Also Read : CM Chandrababu Naidu : చంద్రబాబు కీలక నిర్ణయం.. కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటూ సూచన

హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ తొలిసారిగా డెహ్రా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె త‌న ప్ర‌త్య‌ర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు. రాష్ట్రంలోని నలాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. హమీర్ పూర్ లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగళూర్ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్వార్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ఇన్వతి 4వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్ రాష్ట్రంలో జేడీ(యూ)కి చెందిన కళాధర్ ప్రసాద్ మండల్ రూపాలీలో ఆధిక్యంలో ఉండగా.. తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ పదివేల ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు