బిహార్‌లో తప్పిన ప్రమాదం.. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతి.. పర్యాటకులు ఎలా ఒడ్డుకు చేరారంటే..

బీహార్ రాష్ట్రం రోహ్తాస్ లోని తూట్లా భవాని జలపాతంలో తృటిలో ప్రమాదం తప్పింది. బీహార్ లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బిహార్‌లో తప్పిన ప్రమాదం.. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతి.. పర్యాటకులు ఎలా ఒడ్డుకు చేరారంటే..

Bihar Flood

Updated On : July 13, 2024 / 2:20 PM IST

Tutula Bhawani Waterfall : దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు, వాగులు, జలపాతాలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర పుణెలో విహారయాత్ర కోసం భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లిన ఓ కుటుంబం వరదనీటిలో కొట్టుకుపోయింది. ఐదుగురు వ్యక్తులు అందరూ చూస్తుండగానే జలపాతంలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారు వరదనీటిలో కొట్టుకుపోయి మరణించారు. తాజాగా అలాంటి తరహా ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతో జలపాతం వరదనీటిలో చిక్కుకున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.

Also Read : Gold Price Today : బంగారం కొనుగోలుచేస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్‌

బీహార్ రాష్ట్రం రోహ్తాస్ లోని తూట్లా భవాని జలపాతంలో తృటిలో ప్రమాదం తప్పింది. బీహార్ లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో జలపాతాల వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. రాష్ట్రంలో పేరుగాంచిన జలపాతంలో తూట్లా భవాని జలపాతం ఒకటి. దీంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు జలపాతం అందాలను వీక్షించేందుకు తరలివచ్చారు. కొందరు పర్యాటకులు జలపాతం నీటిలోకిదిగి స్నానాలు చేస్తుండగా.. నిమిషాల్లో ఊహించని విధంగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆందోళన చెందిన పర్యాటకులు తాము వరదలో చిక్కుకుపోతున్నామని పెద్దెత్తున కేకలు వేశారు. వరద ఉధృతి అంతకంతకూ పెరిగిపోతున్న క్రమంలో ఫారెస్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకొని వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Also Read : కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది.. వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం, ఒళ్లు గగుర్పొడిచే వీడియో

జలపాతం వద్ద వరద ఉధృతి నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు. అటవీ శాఖ సిబ్బంది, రెస్క్యూ టీం రావడం కొంచెం ఆలస్యమైనా కొందరు వరద నీటిలో కొట్టుకుపోయేవారని, ఒడ్డుకు చేరేవరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నామని పలువురు పర్యాటకులు పేర్కొన్నారు.