CAA అనేది ‘రౌలత్ చట్టం’..దేశంలో అశాంతి రేకెత్తించే నల్ల చట్టం: ఊర్మిళా మతోండ్కర్ సంచలన వ్యాఖ్యలు

  • Publish Date - January 31, 2020 / 07:08 AM IST

కేంద్రప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రౌలత్ చట్టంతో పోలుస్తూ ఈ చట్టం చరిత్రలో నల్ల చట్టంగా మిగిలిపోతుందని ఉర్మిలా మతోండ్కర్ వ్యాఖ్యానించారు. ముంబైలో గురువారం (జనవరి 30,2020) గాంధీజీ 72వ వర్థంతి సందర్భంగా జరిగిన సభలో ఉర్మిళా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘1919వ సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటీషు వాళ్లు భారతదేశంలో అశాంతిని నెలకొల్పేందుకు ‘‘రౌలత్ చట్టాన్ని’’ అన్నారు.

ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా దేశంలో అశాంతిని రేకెత్తించటానికి రౌలత్ చట్టం లాగే పౌరసత్వ సవరణ చట్టమనే ఓ నల్ల చట్టాన్ని తీసుకువచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.  హాత్మాగాంధీ మన దేశానికే కాదు..ప్రపంచ దేశాలన్నింటికి ఆదర్శమైన మహనాయుడని  అన్నారు.

మనమంతా గాంధీజీ బాటలో నడవాలని..కానీ మహాత్మాగాంధీ ఆశయాలను తూట్లు పొడిచేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయనీ వాటిని ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు ఊర్మిళా. గాంధీజీని  హతమార్చిన నాథూరాం గాడ్సే ముస్లిమ్ లేదా సిక్కు వ్యక్తి కాదని, ఆయన హిందువు అని, ఈ విషయంలో తాను ఎక్కువగా చెప్పాల్సిన పని లేదని ఉర్మిలా మతోండ్కర్ వ్యాఖ్యానించారు.