×
Ad

Cab Driver : క్యాబ్ డ్రైవర్ చేసిన పనికి కంగుతిన్న మహిళ.. రంగంలోకి పోలీసులు.. కొన్ని గంటల్లోనే అరెస్టు..

Cab Driver పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 15న సాయంత్రం 6గంటల సమయంలో మహిళ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లడానికి

Cab Driver

Cab Driver : ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో కారులో మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించమని డ్రైవర్‌ను మహిళ కోరింది. పలుసార్లు మహిళ విజ్ఞప్తి చేసినప్పటికీ డ్రైవర్ ఒప్పుకోకపోవటంతోపాటు.. ఆమెను మార్గం మధ్యలోనే కిందకు దింపేశాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో ఈ నెల 15వ తేదీన సాయంత్రం సమయంలో జరిగింది.

Also Read : Government Employees : ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 15న సాయంత్రం 6గంటల సమయంలో మహిళ తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. మహిళను క్యాబ్‌లో ఎక్కించుకున్న డ్రైవర్ కొద్దిదూరం వెళ్లగానే పెద్ద సౌండ్‌తో కారులో సాంగ్స్ పెట్టాడు. అసౌకర్యానికి గురైన మహిళ వాల్యూమ్ తగ్గించాలని క్యాబ్ డ్రైవర్‌ను కోరింది. అందుకు డ్రైవర్ ఒప్పుకోలేదు. తనకు ఇబ్బందిగా ఉందని వాల్యూమ్ తగ్గించాలని మహిళ గట్టిగా అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన క్యాబ్ డ్రైవర్.. మహిళను మార్గం మధ్యలోనే దింపేశాడు. డ్రైవర్ చేసిన పనికి కంగుతిన్న మహిళ.. తనను గమ్యస్థానానికి చేర్చకుండా ఎలా మధ్యలో వదిలేస్తావని ప్రశ్నించింది.

డ్రైవర్ ప్రవర్తనకు భయపడిపోయిన మహిళ తన భద్రతకోసం వీడియో తీయడం ప్రారంభించింది. ఆవెంటనే పోలీసుల సహాయం కోసం 112కు డయల్ చేసింది. ఈ క్రమంలోనే డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత తనకు జరిగిన ఇబ్బందిపై గురుగ్రామ్ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. రంగంలోకిదిగిన పోలీసులు ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్‌‌ను రోహ్తక్ జిల్లా నివాసిగా గుర్తించారు.

విచారణలో భాగంగా.. మ్యూజిక్ వాల్యూమ్ విషయంలో వివాదం తలెత్తిందని, ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడటం వల్లేనే తాను మధ్యలో దింపేసి వెళ్లడం జరిగిందని క్యాబ్ డ్రైవర్ అంగీకరించాడు. వాహనాన్ని కూడా నిందితుడి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.