Bombay HC: ఆధారాల్లేకుండా భర్తను తాగుబోతు, తిరుగుబోతు అనకూడదు.. బాంబే హైకోర్టు తీర్పు

రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్‭లో పూణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ విడాకులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అప్పీలులో భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని, ఆల్కాహాలిక్ అని పేర్కొంది. ఈ దురలవాట్ల కారణంగా తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదని, తనకు అందాల్సిన ప్రతిఫలాలు దక్కలేదని ఆరోపించింది

Bombay HC: కుటుంబాల్లో అనేక మనస్పర్థలు, గొడవలు వస్తుంటాయి. ఆ సమయంలో అనేక మాటలు అనుకుంటారు. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. అయితే ఆ అనుమానాలన్నీ వాస్తవాలు కాకపోవచ్చు. పైగా అనుమానంతో చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆడవారిని అనే కోణంలో మగవారిని అనే కోణంలో.. ఎవరి వైపు నుంచి చూసినా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.

ఇందులో భాగంగా భర్తను తాగుబోతు, స్త్రీలోలుడు అని ఆరోపిస్తుంటారు. అయితే ఆధారాలు లేకుండా ఇలా అనడం క్రూరత్వం అవుతుందని బాంబే హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. విడాకులు కోరుతూ తన భర్తపై ఒక మహిళ చేసిన ఆరోపణలపై ధర్మాసనం పై విధంగా స్పందించింది.

రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్‭లో పూణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ విడాకులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అప్పీలులో భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని, ఆల్కాహాలిక్ అని పేర్కొంది. ఈ దురలవాట్ల కారణంగా తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదని, తనకు అందాల్సిన ప్రతిఫలాలు దక్కలేదని ఆరోపించింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎటువంటి ఆధారాలు లేకుండా భర్తపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో అతడి పరువు, మర్యాదలు దెబ్బతింటాయని, ఇలాంటి చర్యలు క్రూరత్వమని అభిప్రాయపడింది.

Mufti vs BJP: రిషి సునాక్‭ బ్రిటన్ ప్రధాని కావడంపై మెహబూబా ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత

ట్రెండింగ్ వార్తలు