Mufti vs BJP: రిషి సునాక్‭ బ్రిటన్ ప్రధాని కావడంపై మెహబూబా ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత

‘‘బ్రిటన్‭కు మొదటి భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశం అంతా దీన్ని గొప్పగా భావిస్తున్నారు. మైనారిటీ ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా బ్రిటన్ అంగీకరించింది. అయితే మనం ఇప్పటికీ మైనారిటీలను గౌరవించడం లేదు. ఎన్ఆర్‭సీ, సీఏఏ వంటి విభజన, వివక్షపూరిత చట్టాల ద్వారా సంకెళ్లు వేస్తున్నామని గుర్తుంచుకోవాలి’’ అని ట్వీట్ చేశారు.

Mufti vs BJP: రిషి సునాక్‭ బ్రిటన్ ప్రధాని కావడంపై మెహబూబా ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత

Mufti alleges ‘divisive laws’ in India. BJP’s dare, then a reminder

Mufti vs BJP: భారత మూలాలు ఉన్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి కావడంపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ మైనారిటీ హక్కుల ప్రస్తావనను లేవనెత్తారు. భారత్ నుంచి సునాక్‭కు భారీ ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్న తరుణంలో మన దేశంలోని మైనారిటీ హక్కుల గరించి ప్రస్తావించారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మెజారిటీ జనాభా సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తిప్పి కొట్టారు. ”జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా మైనారిటీని మీరు అంగీకరించగలరా?” అని ఆయన ప్రశ్నించారు.

సోమవారం రిషి సునాక్ ప్రధానమంత్రి ఎన్నిక నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా మెహబూబా స్పందిస్తూ ‘‘బ్రిటన్‭కు మొదటి భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశం అంతా దీన్ని గొప్పగా భావిస్తున్నారు. మైనారిటీ ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా బ్రిటన్ అంగీకరించింది. అయితే మనం ఇప్పటికీ మైనారిటీలను గౌరవించడం లేదు. ఎన్ఆర్‭సీ, సీఏఏ వంటి విభజన, వివక్షపూరిత చట్టాల ద్వారా సంకెళ్లు వేస్తున్నామని గుర్తుంచుకోవాలి’’ అని ట్వీట్ చేశారు.

అయితే దీనిపై రవి శంకర్ ప్రసాద్ స్పందిస్తూ ”రిషి సునాక్ బ్రిటిన్ ప్రధాని కావడంతో మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ చేసిన ట్వీట్ కామెంట్‌ చూశాను. ఇండియాలోని మైనారిటీ హక్కులపై ఆమె వ్యాఖ్యలు చేశారు. మెహబూబా జీ…జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఒక మైనారిటీని ముఖ్యమంత్రిగా మీరు అంగీకరిస్తారా?” అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఇక దేశానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా 10 ఏళ్లు ఉండడాన్ని, ఏపీజే అబ్దుల్ కలాంటి రాష్ట్రపతిగా చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. మైనారిటీని గౌరవించకుండానే వారు దేశాధినేతలు అయ్యారా అని చురకలు అంటించారు.

Rishi Sunak: రవి అస్తమించని దేశానికి తొలి హిందూ ప్రధానమంత్రి.. 10 సంగతులు