Rajiv
Rajiv Gandhi Assassination Convicts : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులందరినీ జైలు నుంచి వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏడుగురు దోషులను రిలీజ్ చేయాలంటూ ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ జరుగుతోంది. వారి విడుదలకు మద్దతుగా లక్షల్లో ట్వీట్లు వచ్చి పడుతున్నాయి. 31 ఇయర్స్ ఆఫ్ ఇన్‌జస్టిస్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను తమిళులు ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. దీనికి సపోర్టుగా సినీ నటులు, పలువురు రాజకీయ నాయకులు, మానవతవాదులు ట్విట్లు చేస్తున్నారు. దోషులను విడుదల చేయాలని గళమెత్తుతున్న వారిలో ఎంపీ థోల్ తిరుమావళవన్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, ప్రకాష్ రాజ్, మీనా కందస్వామి, పర్యావరణవేత్త సౌందరాజన్ తదితరులు ఉన్నారు.
తమిళనాడులో అధికార డీఎంకే, అన్నాడీఎంకేతో సహా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు.. దోషుల విడుదలకు అనుకూలంగా ఉన్నాయి. ఏడుగురు దోషులను మానవతా ప్రాతిపదికన విడుదల చేయాలని కోరుతున్నాయి. అటు ప్రజలు కూడా అదే కోరుకుంటూ పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే డీఎంకే, అన్నాడీఎంకే ప్రతిపాదనలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఇక ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. నిందితులు మూడు దశాబ్దాలుగా జైలు జీవితం అనుభవిస్తుండడంతో వారిని విడుదల చేయాలని కోరారు.
Read More : Left parties: ఇందన ధరల పెంపుపై దేశవ్యాప్త ఆందోళనకు లెఫ్ట్ పార్టీలు