Supreme Court : పుతిన్‌కు ఆదేశాలివ్వలేం కదా.. కేంద్రం చర్యలు భేష్ : సుప్రీంకోర్టు

యుక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తరలించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది.

‘can We Ask Russia To Stop War’ Supreme Court On Petition To Evacuate Indians (2)

Supreme Court : యుక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తరలించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఇప్పటికే వందలాది మంది భారతీయులు యుక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్ కు చేరుకున్నారు.

మరికొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు విమానాలను పంపింది కేంద్రం. అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించి విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చేందుకు కొంతమంది కేంద్రమంత్రులను కూడా ప్రధాని మోదీ పంపించారు. ఒకవైపు యుక్రెయిన్ సహా ఇతర సరిహద్దు ప్రాంతాల నుంచి భారతీయ పౌరుల తరలింపు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

యుక్రెయిన్‌లో భారత విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు గురించి పిటిషన్లలో సుప్రీంకు వివరించారు. అయితే ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. యుక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ వివరణ ఇచ్చారు.

‘can We Ask Russia To Stop War’ Supreme Court On Petition To Evacuate Indians

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. యుక్రెయిన్‌లో చిక్కి విద్యార్థుల గురించి ఆందోళన చెందుతున్నామని ఎన్వీ రమణ అన్నారు. గతంలో జరిగిన యుద్ధాల వల్ల తలెత్తే పరిస్థితుల నుంచి అనుభవాలను నేర్చుకోలేకపోవడం దురద్రుష్టకరమన్నారు. ఇంతకుమించి మేం చెప్పగలిగేది ఏం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు భేష్ అని ధర్మాసనం ప్రశంసించింది. అక్కడే చిక్కిన విద్యార్థుల గురించే చాలా ఆందోళనగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చాలా సున్నితమైనా పరిస్థితులు నెలకొని ఉన్నాయని అన్నారు. ఈ పరిస్థితులపై తాము అంతగా చెప్పేది ఏమి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

Read Also : Russia ukraine war : తొమ్మిది రోజుల్లో 9,166మంది రష్యా సైనికుల్ని అంతమొందించాం : యుక్రెయిన్