ఎన్నికల షెడ్యూల్: అభ్యర్థి పాన్ కార్డ్ ఇవ్వకపోతే అంతే

ఎన్నికల కమిషన్ అభ్యర్థులకు పాన్ కార్డు తప్పనిసరి చేసింది. పాన్ కార్డు లేదంటే నామినేషన్ తిరస్కరిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదేళ్ల పాటు ఉన్న కాలంలో అభ్యర్థులు ఐటీ రిటర్న్‌లు చేశారా.. లేదా అనే నిర్దారణ కోసం పాన్ ను జత చేయాలని ఆదేశించింది.

పాన్ కార్డుతో పాటు భార్య, విడిపోయిన హిందూ ఫ్యామిలీ సభ్యుల వివరాలను కూడా  నమోదు చేయాలని తెలిపింది. ఎన్నికల్లో ఏవైనా తప్పులు జరుగుతున్నట్లు తెలిసినా.. సూచనలు ఇవ్వాలనుకున్నా.. టోల్ ఫ్రీ నెంబర్  1950 లేదా 1800111400  నెంబర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికల్ షెడ్యూల్ ప్రకటనలో తెలిపారు.