ఇద్దరు ఢిల్లీ గూండాలకు బెంగాల్ ని సరెండర్ చేయను

ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని సరెండర్ చేయబోమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు.

Mamata

Mamata ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని సరెండర్ చేయబోమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు. గురువారం దక్షిణ దినాజ్‌పూర్‌లో జరిగిన బహిరంగ స‌భ‌ ర్యాలీలో మ‌మ‌తా బెన‌ర్జీ మాట్లాడుతూ.. నేను ప్లేయర్ ని కానప్పటికీ ఆట ఎలా ఆడాలో మాత్రం నాకు తెలుసు. ఇంతకుముందు లోక్ సభలో నేను ఉత్తమ ప్లేయర్ గా ఉన్నాను. మా బెంగాల్ ను ఇద్దరు ఢిల్లీ గూండాలకు అప్పగించబోమన్నారు. పరోక్షంగా బీజేపీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, కొవిడ్ వ్యాప్తి భ‌యాందోళ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు పెద్ద ఎత్తున హాజ‌రైన కార్య‌క‌ర్త‌లు ఎలాటి భౌతిక దూర నిబంధనలను పాటించకపోవడం కనిపించింది. ఇక, పశ్చిమ బెంగాల్‌లో బుధవారం అత్యధికంగా 10,784 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో కేసుల సంఖ్య‌ 6,88,956 కు చేరిందని ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది.

మరోవైపు,ఎనిమిది దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఐదు దశలు ఇప్పటికే పూర్తవగా… ఆరో దశలో నాలుగు జిల్లాల్లోని 43 నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. గురువారం సాయంత్రం 5:3గంటల సమయానికి 79.04శాతం పోలింగ్ నమోదైంది. ఇకఈ నెల 26న ఏడోదశ పోలింగ్, ఈ నెల 29న ఎనిమిదో దశ పోలింగ్ జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.