Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి
వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ పటేల్ మాట్లాడుతూ.. కారు ప్రమాదంలో

Road Accident Gujara
Road Accident in Gujara : గుజరాత్ లోని సబర్‌కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కారులో కొందరు వ్యక్తులు శ్యామలాజీ ఆలయాన్ని సదర్శించుకొని అహ్మదాబాద్ కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో సబర్‌కాంత జిల్లాలోని హిమత్ నగర్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున కారు వేగంగా వచ్చి ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ పటేల్ మాట్లాడుతూ.. కారు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణీకులు మరణించినట్లు తెలిపారు. ప్రమాదం అనంతరం కారులో ఉన్నవారిని అతికష్టంమీద బయటకు తీశారు. కారును కట్టర్లతో కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద తీవ్రతను చూస్తుంటే ప్రమాదం సమయంలో కారు అతివేగంతో వెళ్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా అహ్మదాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Sabarkantha, Gujarat | A car collided with a heavy vehicle in Himmatnagar. The police and fire department present at the spot. Injuries and casualties feared. More details awaited. pic.twitter.com/kHGz5tkl30
— ANI (@ANI) September 25, 2024