Cattle Feed For Mid Day Meal In Pune Municipal School
Cattle feed for mid-day meal In Pune Municipal school : స్కూళ్లల్లో చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం కాకుండా పశువుల దాణా అందింది. పూణె మున్సిపల్ కార్పొరేషన్ లో పిల్లల కోసం పంపించే ఆహార పదార్ధాలు వచ్చిన లోడును పరిశీలించిన అధికారులు షాక్ అయ్యారు. విద్యార్ధులకు పెట్టే ఆహార పదార్ధాలకు బదులుగా ‘పశువుల దాణా’ రావటం చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై పూణె మేయర్ మురళీధర్ మొహోల్ స్పందిస్తూ..వచ్చిన ఆహార పదార్థాల్ని పంచడం మాత్రమే తమ డ్యూటీ అనీ అన్నారు. కానీ ఇలా జరగటం మాత్రం సరైంది కాదనీ..పిల్లలకు పెట్టే ఆహారానికి బదులుగా పశువుల దాణా రావడాన్ని తీవ్రంగా తప్పుపట్టారామె. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా..భారత్‌లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం గురించి పలు వివాదాలు ఉన్నాయి. పిల్లలకు పెట్టే ఆహార సరఫరాలో జరిగే పొరపాట్లు, అవినీతి కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి పలు ఘటనలు వివాదాస్పదమయ్యాయి కూడా. దానికి ఉదాహరణే ఈ పశువుల దాణా ఘటన.
దేశంలోని అత్యంత ధనవంతమైన మున్సిపల్ కార్పొరేషన్లలో పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి అనే విషయం తెలిసిందే. దీనికి ఉదాహరణ గత జనవరి 15 వరకు రూ.3,285 కోట్ల ఆదాయం పూణె మున్సిపాలిదీ. ఇంతటి ఆర్థిక వనరులు ఉన్న నగరంలోని మున్సిపల్ స్కూల్ నెం 58లో తాజా ఘటన జరగడం గమనించాల్సిన విషయం. పిల్లలు పంపించే ఆహారం విషయంలో సంబంధిన వ్యక్తులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈక్రమంలో కరోనాను కట్టడి చేయటానికి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధింత యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో పూణె కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 58వ నెంబర్ మున్సిపల్ స్కూల్లో చదివే విద్యార్ధులకు ఆహార పదార్ధాలను పంపించాల్సి ఉంది. దీంట్లో భాగంగా మధ్యాహ్న భోజన పథకం వస్తువుల కింద పంపించే వాహనంలో ఆహార పదార్ధాలకు బదులుగా పశువుల దాణా అందింది. దీన్ని చూసిన అధికారులు ఒక్కసారి షాక్ అయ్యారు.
ఈ విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్తలు హైలైట్ చేయడంతో విషయం ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ దృష్టికి వెళ్లింది. దీంత్ో రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు దాణాను రికవర్ చేసుకున్నారు.దీనిపై స్పందించిన పూణె మేయర్ మురళీధర్ మొహోల్.. వచ్చిన ఆహార పదార్థాల్ని పంచడం మాత్రమే తమ విధి అని అన్నారు. అలాగే విద్యార్ధులకు పెట్టే ఆహారపదార్ధాలు కాకుండా పశువుల దాణా రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారామె. అనంతరం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినవారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.