ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు లంచాలు మరిగారు. రోడ్డుపై వాహనాలను ఆపడం, వాహనదారులను బెదిరించడం, వారి నుంచి డబ్బు తీసుకుని వదిలేయడం వంటి పనులు చేస్తున్నారు. వచ్చిన డబ్బునంతా ఒక చోట దాచి డ్యూటీ అయిపోయే సమయానికి ముగ్గురూ కూర్చొని ఆ డబ్బుని పంచుకుంటున్నారు.
తాజాగా వారు డబ్బులు పంచుకుంటూ కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం ఇలా బయటపడింది. థ్రిల్ లారీ సర్కిల్‌లోని గాజీపూర్‌లోని పోలీసు చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఆ ముగ్గురు పోలీసుల్లో ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లని, మరొకరు కానిస్టేబుల్ అని అధికారులు తెలిపారు. లంచాలు తీసుకుని, దర్జాగా కూర్చుని ఆ డబ్బుని వారు పంచుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకోవడమే కాకుండా ప్రతిరోజు లంచాల రూపంలో ట్రాఫిక్ పోలీసులు వేలాది రూపాయల చొప్పున సంపాదిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Alleged TRAFFIC POLICE BRIBERY RACKET BUSTED IN DELHI
Allegations: A bribery racket was exposed at the Gazipur police station, where traffic police officers had set up a makeshift structure to extort money from people.
A video has surfaced showing the officers taking bribes… pic.twitter.com/iDcxVuTveH
— Atulkrishan (@iAtulKrishan1) August 17, 2024