Viral video: పాము ఆవలిస్తే ఎట్టా ఉంటుందో చూడండి..

ఇటువంటి అరుదైన సంఘటనను వీడియో తీసిన వ్యక్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Viral video: పాము ఆవలిస్తే ఎట్టా ఉంటుందో చూడండి..

Updated On : August 18, 2024 / 3:43 PM IST

నిద్ర వచ్చే ముందు మనుషులకు ఆవలింతలు రావడం సహజమే. అయితే, ఇతర జంతువులకు ఆవలింతలు వస్తే ఆశ్చర్యంగా చూస్తాం. ఇక పాములకు ఆవలింత వస్తే అదీ పెద్ద వింతే. ఓ పాము ఆవలిస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని నోరు మొత్తం తెరవడంతో అందులోని భాగాలన్నీ స్పష్టం కనపడ్డాయి.

ఈ అరుదైన వీడియోను @AMAZlNGNATURE అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 11 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియో ఎక్స్ ఖాతాదారులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ క్లిప్‌లో పాము నెమ్మదిగా నోరు తెరవడం చూడొచ్చు. అచ్చం మనుషులలాగే అది ఆవులించింది.

ఇటువంటి అరుదైన సంఘటనను వీడియో తీసిన వ్యక్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వీడియోను చూడలేదని కొందరు కామెంట్లు చేశారు. ఇది మొదట గగుర్పాటు పొడిపించిందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రకృతిలో ఇటువంటి అద్భుతాలను చాలా చూడవచ్చని మరో నెటిజన్ పేర్కొన్నాడు. మీరూ ఈ వీడియోను చూసేయండి..

Also Read: ఓర్నాయనో.. బైక్‌పై వెళ్తున్న వారిని ముందుకు నెట్టిన ఎద్దు.. వీడియో వైరల్