ఓర్నాయనో.. బైక్‌పై వెళ్తున్న వారిని ముందుకు నెట్టిన ఎద్దు.. వీడియో వైరల్
'ఎక్స్‌ప్లోరింగ్ లైఫ్ 007' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

రోడ్లపైకి ఎద్దులను, గేదెలను వదులుతూ వాహనదారులకి ప్రమాదం తెచ్చేలా ప్రవర్తిస్తారు ఆ పశువుల యజమానులు. రద్దీగా ఉండే ఓ రోడ్డులో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి.
‘ఎక్స్‌ప్లోరింగ్ లైఫ్ 007’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎద్దు దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో రద్దీగా ఉండే రహదారిపై చోటుచేసుకుంది. బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తిని ఎద్దు ముందుకు నెట్టుతూ కొద్ది దూరం వరకు వెళ్లింది.
దీంతో ఆ బైక్ పై ఉన్న వారికి సాయం చేయడానికి అక్కడి వారు ప్రయత్నించారు. దీంతో ఎద్దు ఆ బైక్ పై ఉన్నవారికి వదిలేసి రహదారిపై మరో దిశగా వెళ్లింది. అది తమ మీదకు వస్తుందేమేనని స్థానికులు భయాందోళనలు చెందారు.
View this post on Instagram
Divvala Madhuri : దువ్వాడ ఫ్యామిలీ ఫైట్.. సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్న దివ్వెల మాధురి పోస్టులు