కీలక నిర్ణయాలు తీసుకున్న సీబీఐ చీఫ్ నాగేశ్వరరావు

వివాదాల్లో సీబీఐ..అలోక్ వర్మ చేసిన ట్రాన్సఫర్ లను రద్దుచేసిన నాగేశ్వరరావు. 

  • Publish Date - January 11, 2019 / 10:16 AM IST

వివాదాల్లో సీబీఐ..అలోక్ వర్మ చేసిన ట్రాన్సఫర్ లను రద్దుచేసిన నాగేశ్వరరావు. 

ఢిల్లీ: సీబీఐ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ చీఫ్ గా ఎం.నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రెండు రోజుల క్రితమే సుప్రీం కోర్టు అలోక్ వర్మను తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ అలోక్ వర్మను  గురువారం డైరెక్టర్ హోదా నుంచి తప్పించటంతో ఆయన స్ధానంలో  నాగేశ్వరరావు నేడు బాధ్యతలు తీసుకున్నారు. అలోక్ వర్మను ప్రభుత్వం అగ్ని మాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. కానీ ఆ పదవిని చేపట్టేందుకు ఆయన నిరాకరించి రాజీనామా చేశారు. అలోక్ వర్మ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.
అలోక్ వర్మ లీవులో ఉన్న అక్టోబరులో నాగేశ్వరరావు తాత్కాలిక చీఫ్ గా పనిచేశారు. 1986 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆఫీసర్ అక్టోబర్ 23 తెల్లవారుఝూమున 2గంటలకు నాటకీయ పరిణామాల మధ్య బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలోక్ వర్మ చేసిన బదిలీలలను నాగేశ్వరరావు రద్దు చేశారు.  కాగా….ఢిల్లీ  హై కోర్టులో రాకేష్ ఆస్ధానా, దేవేందర్ లు  తమపై వేసిన చార్జిషీట్ ను కొట్టి వేయాలని వేసిన పిటీషన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన వెంటనే అలోక్ వర్మ చేపట్టిన నియామకాలు, కమిటీలు, బదిలీలను రద్దు చేస్తూ నాగేశ్వరరావు  నిర్ణయం తీసుకున్నారు.  అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నాగేశ్వరరావు దర్యాప్తు కొనసాగించనున్నారు. 

ట్రెండింగ్ వార్తలు