150 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

అవినీతి అణిచివేతలో భాగంగా దేశంలోని 150 ప్రాంతాల్లో ఇవాళ(ఆగస్టు-30,2019)సీబీఐ సోదాలు నిర్వహించింది. వివిధ డిపార్ట్మెంట్ లలో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ శాఖల్లోనే భారీగా అవినీతి జరుగుతందని సామాన్య ప్రజలు,చిన్న వ్యాపారవేత్తలు ఫీల్ అవుతున్న సమయంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

సీబీఐ సోదాలు నిర్వహించిన డిపార్ట్మెంట్ లలో రైల్వేస్,కోల్ మైన్స్ అండ్ కోల్ ఫీల్డ్స్, మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా,ఈఎస్ఐసీ, ట్రాన్స్ పోర్ట్, సీపీడబ్ల్యూడీ,జీఎస్టీ డిపార్ట్మెంట్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్,బీఎస్ఎన్ఎల్,పోర్ట్ ట్రస్ట్, నేషనల్ హైవేస్,ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్,సబ్ రిజిస్టార్ ఆఫీస్ లలో,షిప్పింగ్ కార్పొరేషన్ సహా మరికొన్ని డిపార్ట్మెంట్ లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.