భారీ కుంభకోణం : 20 బ్యాంకుల నుంచి రూ.2వేల 500 కోట్లు దోచేశారు

2004-12 మధ్యలో 20 బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు లోన్ల రూపంలో తీసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్  బ్యాంక్,

  • Publish Date - April 12, 2019 / 07:29 AM IST

2004-12 మధ్యలో 20 బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు లోన్ల రూపంలో తీసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్  బ్యాంక్,

బ్యాంకులను మోసం చేసిన ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. బ్యాంకుల నుంచి వేల కోట్ల  రూపాయలు రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత ఎగ్గొట్టడం కామన్ గా మారింది. ఇప్పటికే విజయ్  మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్లు బ్యాంకులను ముంచేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ  గడిపేస్తున్నారు. వారి వ్యవహారం మరువక ముందే మరో భారీ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ బయటపడింది.  ముంబైలో జరిగిన ఈ ఫ్రాడ్ ని సీబీఐ బయటపెట్టింది. ఇది 2వేల 500 కోట్ల రూపాయల బ్యాంక్  లోన్ ఫ్రాడ్.
Read Also : చంద్రబాబు ఆగ్రహం : అందరూ కలిసి టీడీపీపై కుట్రలు, ఏపీని బీహార్ చేస్తారా!

ముంబైకి చెందిన పరేఖ్ అల్యూమినెక్స్ లిమిటెడ్ కంపెనీ ఈ మోసం చేసింది. సీబీఐ అధికారులు  పలుమార్లు జరిపిన సోదాల్లో ఈ మోసం వెలుగుచూసింది. షెల్ కంపెనీల పేరుతో రుణాలు  తీసుకుని మోసం చేసినట్టు గుర్తించారు.

2004-12 మధ్యలో 20 బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు లోన్ల రూపంలో తీసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్  బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ కంపెనీపై 2017 తొలి కేసు నమోదైంది. కంపెనీ సీఎండీ అమితాబ్ అరుణ్ పరేఖ్ 2013లో చనిపోయారు. లోన్లు రీ పే చెయ్యకపోవడంతో బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. వ్యవహారం పెద్దది కావడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. వారి సోదాల్లో విస్తుపోయే మోసం వెలుగులోకి వచ్చింది.
Read Also : జగన్‌కి వేల కోట్లు ఎవరిచ్చారు : కేసీఆర్‌కి ఏపీలో ఏం పని