కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టు

పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన సీబీఐ అలాగే ఘటనాస్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో సుప్రీంకోర్టులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ అధికారులు నివేదికలో పొందుపర్చారు. పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన సీబీఐ అలాగే ఘటనాస్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.

ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించి, ఏ మేరకు సమాచారం రాబట్టామన్నది కూడా సుప్రీంకోర్టుకు నివేదికలో తెలిపింది. కాగా, వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ ఘటనపై దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, వైద్యులు పలు రంగాల వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.

Vijay : పార్టీ జెండాని ఆవిష్కరించిన విజయ్.. ఇదే విజయ్ పార్టీ జెండా.. ఇక తమిళ రాజకీయాల్లో దూకుడు..

ట్రెండింగ్ వార్తలు