CBSE : 9వ తరగతి విద్యార్ధులకు డేటింగ్, రిలేషన్స్‌పై పాఠాలు.. నెటిజన్ల ఆశ్చర్యం

9వ తరగతి పాఠ్యాంశాల్లో డేటింగ్, రిలేషన్స్ అనే చాప్టర్లు ప్రవేశ పెట్టింది CBSE . దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

CBSE

CBSE : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 9వ తరగతి విద్యార్ధుల కోసం పాఠ్య పుస్తకాల్లో డేటింగ్, రిలేషన్స్‌కి సంబంధించిన చాప్టర్లను ప్రవేశపెట్టింది. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Union Budget 2024-25 : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో శాఖలవారిగా కేటాయింపులు ఇవే..

టీనేజ్‌లో చిగురించే ప్రేమ ఆ సమయంలో ఏర్పడే రిలేషన్స్ ఆ వయసులోని వారిని గందరగోళంలోకి నెట్టేస్తాయి. ఈ అంశాలపై తల్లిదండ్రులు పిల్లలతో చర్చించడానికి అసౌకర్యంగా ఫీలవుతారు. తమ పిల్లల నడవడిక విషయంలో సమస్య ఎదురైతే ఇంటర్నెట్ లేదా ఫ్రెండ్స్‌ని సలహాలు సూచనలు అడుగుతుంటారు. ఇది వారికి  ఖచ్చితంగా పర్మెనెంట్ సొల్యూషన్ చూపకపోవచ్చును. ఈ అంశాలపై చర్చించడానికి పాఠశాలలు అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ దిశలో ముందడుగు వేసింది. 9వ తరగతి విద్యార్ధుల కోసం వారి పాఠ్య పుస్తకాలలో డేటింగ్ మరియు సంబంధాలపై ప్రత్యేక చాప్టర్లను ప్రవేశ పెట్టింది. గోస్టింగ్, క్యాట్‌ఫిషింగ్, సైబర్‌బుల్లింగ్ వంటి ఫేమస్ డేటింగ్ పదాలకు వివరణలతో పాటు క్రష్‌లు, ప్రత్యేక స్నేహాలు వంటి అంశాలను కథలు, ఉదాహరణలుగా ఈ చాప్టర్లలో వివరించబడ్డాయి.

Union Budget 2024 : ప్రత్యక్ష, పరోక్ష పన్నురేట్లలో ఎలాంటి మార్పులు లేవు.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే..

@nashpateee అనే ట్విట్టర్ యూజర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై టిండర్ ఇండియా కూడా స్పందిస్తూ ‘నెక్ట్స్ చాప్టర్  బ్రేకప్స్‌ని ఎలా ఎదుర్కోవాలి’ పెడితే ప్రయోజనకారిగా ఉంటుంది అని సూచించింది. CBSE చొరవకు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు. ఇంటర్నెట్ యుగంలో పిల్లలకు ఇలాంటి పాఠాలు చాలా అవసరమని ఇవి ఎంతో మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.