Union Budget 2024-25 : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో శాఖలవారిగా కేటాయింపులు ఇవే..
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Nirmala Sitharaman
Nirmala Sitharaman : 2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
- శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
- రక్షణ రంగానికి రూ 6.2 లక్షల కోట్లు
- ఉపరితల రవాణా, జాతీయ రహదారులు రూ. 2.78 లక్షల కోట్లు
- రైల్వేకి రూ. 2.55 లక్షల కోట్లు
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీకి రూ. 2.13 లక్షల కోట్లు
- హొం శాఖకు రూ. 2.03 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ. 1.77లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువులు : రూ. 1.68 లక్షల కోట్లు
- కమ్యూనికేషన్లు రూ. 1.37 లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు
- కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపులు ఇలా..
- గ్రామీణ ఉపాధి హామీ పథకం రూ.86వేల కోట్లు
- ఆయుష్మాన్ భారత్ : రూ. 7,500 కోట్లు
- పారిశ్రామిక ప్రోత్సాహకాలకు : రూ. 6,200 కోట్లు
- సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి : రూ. 6,903 కోట్లు
- సోలార్ విద్యుత్ గ్రిడ్‌కి : రూ. 8,500 కోట్లు
- గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కి : రూ. 600 కోట్లు
- రాష్ట్రాలకు కేంద్రం నుంచి జరిగే నిధుల బదిలీ 2024-25 ఆర్ధిక అంచనాలు ..
- పన్నుల్లో రాష్ట్రాలకు : రూ. 12,19,783 కోట్లు
- జాతీయ విపత్తు నిర్వహణ నిధికి : రూ. 11,474 కోట్లు
- విదేశీ రుణ సదుపాయం ప్రాజక్టులకు గ్రాంటు కింద : రూ. 8వేల కోట్లు
- విదేశీ రుణ సదుపాయం ప్రాజక్టులకు లోన్ కింద : రూ. 33,900 కోట్లు
- ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ పథకాలకు : రూ. 29 కోట్లు
- 275(1) అధికరణం కింద చేపట్టే పథకాలకు : రూ. 1300 కోట్లు
- మూలధన వ్యయంకోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం : రూ. 1,30,000 కోట్లు
- ప్రత్యేక సహాయం డిమాండ్ కింద రాష్ట్రాలకు బదిలీ : రూ.4వేల కోట్లు
- ఆర్ధిక సంఘం గ్రాంట్లు రూ. 1,32,378 కోట్లు, వాటిలో…
- పట్టణ స్థానిక సంస్థలకు : రూ. 25,653 కోట్లు
- గ్రామీణ స్థానిక సంస్థలకు : రూ. 49,800 కోట్లు
- ఆరోగ్య రంగానికి : రూ. 6,004 కోట్లు
- కొత్త నగరాల ఇంక్యుబేషన్ కోస : రూ. 500 కోట్లు
- పురపాలికల్లో సర్వీసుల కోసం : రూ. 250 కోట్లు
- రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి : రూ. 20,550 కోట్లు
- ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిధికి : రూ. 5,138 కోట్లు
- రెవెన్యూ లోటు గ్రాంటుకు : రూ. 24,483 కోట్లు
- ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదలాయించే నిధులు మొత్తం : రూ. 6,81,400 కోట్లు ఇందులో..
- కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు : రూ. 4,79,526 కోట్లు
- కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు : రూ. 58,938 కోట్లు
- వ్యయ విభాగం కింద : రూ. 1,42,833 కోట్లు
- మూలధన బదిలీ కింద : రూ. 103 కోట్లు