CBSE Exams : విద్యార్థుల‌కు అలర్ట్‌.. సీబీఎస్ఈ 10వ‌ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు..

సీబీఎస్‌ విద్యార్థుల‌కు సంబంధించిన కీల‌క అప్‌డేట్‌ను బోర్డు విడుద‌ల చేసింది.

CBSE Revised Date Sheet 2024

CBSE Revised Date Sheet 2024 : సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్‌) విద్యార్థుల‌కు సంబంధించిన కీల‌క అప్‌డేట్‌ను బోర్డు విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ల‌లో స్వ‌ల్ప మార్పులు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. అంతేకాదండోయ్ స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో ఏ మార్పులు జ‌రిగాయంటే..?

ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 16న జ‌ర‌గాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్ర‌వ‌రి 28కి మార్చారు. అదే విధంగా మార్చి 4న జ‌ర‌గాల్సిన టిబెట‌న్ ప‌రీక్ష‌ను ఫిబ్ర‌వ‌రి 23న‌, మార్చి 5 జ‌ర‌గాల్సిన ఫ్రెంచ్ ప‌రీక్ష‌ను ఫిబ్ర‌వ‌రి 20కి మార్చారు.

12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో ఏం మార్పులు జ‌రిగాయంటే..?

12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో పెద్ద‌గా మార్పులు చోటు చేసుకోలేదు. కేవ‌లం ఒకే ఒక మార్పు జ‌రిగింది. ఫ్యాష‌న్ స్ట‌డీస్ స‌బెక్టు ప‌రీక్ష ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం మార్చి 11 జ‌ర‌గాల్సి ఉండ‌గా మార్చి 21కి మార్చారు.

Also Read: రామాలయం ప్రవేశద్వారం వద్ద హనుమాన్, సింహాల విగ్రహాలు

సీబీఎస్ విడుద‌ల చేసిన షెడ్యూల్ ప్రకారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార్చి 13 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. అదే విధంగా 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు జ‌ర‌గ‌నునున్నాయి. ఈ ప‌రీక్ష‌లు అన్ని ప్ర‌తి రోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయ‌ని బోర్డు తెలిపింది. ప‌రీక్ష‌కు ప‌రీక్ష‌కు మ‌ధ్య గ్యాప్ ఇవ్వ‌డంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ ప‌రీక్ష‌ల తేదీల‌ను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను రూపొందించారు.

ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
– సీబీఎస్ఈ వెబ్‌సైట్ cbse.gov.in వెళ్లాలి
– సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2024 రివైజ్డ్ డేట్‌షీట్ అనే లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది
– లింక్ పై క్లిక్ చేసిన త‌రువాత పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
– దాన్ని డౌన్ లోడ్ చేసుకుని మారిన ప‌రీక్షా తేదీలు చూసుకోవ‌చ్చు.