Ayodhya Ram Mandir : రామాలయం ప్రవేశద్వారం వద్ద హనుమాన్, సింహాల విగ్రహాలు
అయోధ్యలోని రామ మందిరం ప్రవేశద్వారం వద్ద ఏనుగులు, సింహాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుంచి సేకరించిన ఇసుకరాయితో ఈ విగ్రహాలను తయారు చేశారు....

Statues of Lord Hanuman, lions
Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామ మందిరం ప్రవేశద్వారం వద్ద ఏనుగులు, సింహాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుంచి సేకరించిన ఇసుకరాయితో ఈ విగ్రహాలను తయారు చేశారు. రామాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఏనుగులు, సింహాలు, హనుమంతుడు,గరుడ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ట్రస్ట్ సీనియర్ అధికారి తెలిపారు. దేవాలయంలోకి ప్రవేశం తూర్పు వైపు నుంచి ఉంటుంది. దక్షిణం వైపు నుంచి భక్తులు నిష్క్రమించనున్నారు.
ALSO READ : Ram Janmabhoomi temple : అయోధ్య రామ మందిరంలో హైటెక్ భద్రతకు రూ.90కోట్లతో కవచ్
మొత్తం ఆలయ నిర్మాణం మూడు అంతస్తులుగా ఉందని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. సందర్శకులు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు.ఆలయానికి వెళ్లే మెట్లకు ఇరువైపులా అమర్చిన అంచెల పలకలపై ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు. దిగువ పలకలపై ఒక్కో ఏనుగు ప్రతిమ, రెండో స్థాయిలో ఒక్కో సింహం విగ్రహం, పైభాగంలో హనుమంతుడి విగ్రహం ఒకవైపు ఉండగా, మరో వైపు గరుడ విగ్రహం ఉంది.
ALSO READ : Prime Minister Narendra Modi : లక్షద్వీప్ ప్రెస్టిన్ బీచ్‌లో మోదీ సాహస స్విమ్మింగ్
సంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంది.ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు చెప్పారు.