Prime Minister Narendra Modi : లక్షద్వీప్ ప్రెస్టిన్ బీచ్‌లో మోదీ సాహస స్విమ్మింగ్

లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌కు వెళ్లి, సహజమైన బీచ్‌లను ఆస్వాదించారు.....

Prime Minister Narendra Modi : లక్షద్వీప్ ప్రెస్టిన్ బీచ్‌లో మోదీ సాహస స్విమ్మింగ్

PM Modi goes snorkelling

Updated On : January 5, 2024 / 5:11 AM IST

Prime Minister Narendra Modi : లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రెస్టిన్ బీచ్ లో సేద తీరారు. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌కు వెళ్లి, సహజమైన బీచ్‌లను ఆస్వాదించారు. ఉదయాన్నే ఆయన బీచ్‌ల వెంట నడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌ని ప్రయత్నిస్తున్న చిత్రాలను పంచుకున్నారు.

ALSO READ : Jasprit Bumrah : కేప్‌టౌన్‌లో బుమ్రా రికార్డులు.. ఒకే ఒక్క భార‌తీయుడు..!

లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. లక్షద్వీప్ ప్రశాంతత 140 కోట్ల భారతీయుల సంక్షేమానికి మరింత కష్టపడి పనిచేయాలని ప్రతిబింబించిందని మోదీ పేర్కొన్నారు. లక్షద్వీప్ బసలో తాను స్నార్కెల్లింగ్ కు ప్రయత్నించానని, ఇది ఎంతో సంతోషాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు. సాహసాలు చేయాలనుకునే వారు లక్షద్వీప్ సందర్శించాలని మోదీ సూచించారు. ప్రధాన మంత్రి నీటి అడుగున తీసిన చిత్రాలను కూడా పంచుకున్నారు.

ALSO READ : అయోధ్య రాముడి గుడి ప్రత్యేకతలు

తాను స్నార్కెలింగ్‌కు వెళ్లినప్పుడు తాను దిబ్బలు, సముద్ర జీవులను చూశానన్నారు. తాను తెల్లవారుజామున బీచ్‌ల వెంట నడిచానని, ఇది స్వచ్ఛమైన ఆనంద క్షణాలు అని ప్రధాని మోదీ అన్నారు. అగట్టి, బంగారం, కవరత్తి వాసులతో తాను సంభాషించానని, వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు.