చావు అంచుల దాకా   : ఢీకొట్టిన కారు..గాల్లో  బైక్

  • Publish Date - February 22, 2019 / 06:45 AM IST

కోయంబత్తూరు: అదేదో సినిమాలో స్వర్గపు అంచులదాకా వెళ్లాచ్చాను సార్ అంటాడు ఓ కమేడియన్. కానీ చావు అంచులదాకా వెళ్లొస్తే ఎలా ఉంటుంది. వెన్నులో వణుకు వచ్చేస్తోంది కదూ. ఓ టూవీలర్ కు అటువంటి భయంకరమైన అనుభవం ఎదురైంది. చావు నోట్లో దాదాపు తలపెట్టి..వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. 100 కిలోమీటర్ల స్పీడుతో వచ్చిన ఓ  కారు ఢీకొట్టేసింది. ఆ తరువాత ఏమైంది అంటారా? ఏముంది కారువారు అంతే స్పీడ్ లో చెక్కేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది.
 

అవినాష్ అనే వ్యక్తి రోడ్డులో బైక్‌పై వెళుతున్నాడు. సడెన్ గా కనురెప్పపాటు వేగంతో ఓవర్ స్పీడుతో ఓ కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. కారు స్పీడు దెబ్బకు ఆ వ్యక్తి బైక్‌తో సహా గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. కానీ ఆ కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో బాధితుడికి ప్రాణాపాయం లేకుండా చిన్నపాటి గాయాలతో బైటపడ్డటం విశేషం. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గాలించే పనిలో ఉన్నారు పోలీసులు.