Election 2021
Celebrities : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పాగా వేద్దామని అనుకున్న పార్టీలు చతికిలపడ్డాయి. ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షిద్దామని అనుకున్న నటుల్లో కొందరు పరాజయం చెందగా..మరికొందరు గెలిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ ను ప్రజలు గెలిపించారు.
చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి..60 వేల మెజార్టీ సాధించి..గెలుపొందారు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నటి ఖుష్బూ పోటీ చేశారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి..పోటీ చేసినా..ప్రజలు ఆదరించలేదు. డీఎంకే నేత ఎళిలన్ చేతిలో పరాజయం చెందారు.
ఇక తమిళనాడు రాష్ట్రంలో గెలుస్తామని బీరాలు పలికిన..మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలు కావడం గమనార్హం. ఈయన కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు.
డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పరాజయం పాలయ్యారు. నామ్ తమిళర్ కట్చి నేత, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ తిరువొత్తియూరు నుంచి ఓటమి పాలయ్యారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఓటమి తప్పలేదు.
Read More : Anjani Kumar IPS : కరోనా టైం..ఆభరణాలను ఇంట్లోనే ఉంచండి