Anjani Kumar IPS : కరోనా టైం..ఆభరణాలను ఇంట్లోనే ఉంచండి

Anjani Kumar IPS : కరోనా టైం..ఆభరణాలను ఇంట్లోనే ఉంచండి

Hyd Cp

Telangana Covid : కరోనా పరీక్షలు, చికిత్సకు వెళ్లే వారు..ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచి రావాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. ఏ సమస్య రాకుండా..ఉండేందుకు ఇలా చేయడం కరెక్టు అని తెలిపారు. కరోనా చికిత్సలు, పరీక్షలకు వచ్చిన వారు..విలువైన వస్తువులు పొగొట్టుకుని..పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టడం..కుటుంబసభ్యులు మొత్తం ఆందోళనకు గురి కావడం మంచిది కాదన్నారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్యులు, పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారాయన.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత 24 గంటల్లో 7 వేల 430 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 5 వేల 567 మంది కోలుకున్నారు. అయితే ఒక్క రోజులో 56 మంది చనిపోయారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1546 కేసులు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 533, రంగారెడ్డిలో 475, నల్గొండలో 368, సంగారెడ్డిలో 349, వరంగల్‌ అర్బన్‌లో 321, నిజామాబాద్‌లో 301 కేసులు రికార్డ్ అయ్యాయి.

Read More : Lockdown : ముంబైలో కరోనా తగ్గుముఖం…లాక్ డౌన్ ఫలితం