ఇప్పుడయినా చదవండి : రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో సెల్ ఫోన్లు నిషేధం

  • Publish Date - October 17, 2019 / 10:32 AM IST

ప్రతొక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉండడం కామన్ అయిపోయింది. విద్యార్థుల సంగతి చెప్పనవసరం లేదు. నిత్యం ఫోన్లు వాడుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఛాటింగ్‌, గేమ్స్, టిక్ టాక్, ఫేస్ బుక్..లను కొన్ని గంటల పాటు వాడేస్తున్నారు. బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నా..పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. దీంతో నాణ్యమైన విద్య అందివ్వాలని..విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారవద్దని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అక్టోబర్ 17వ తేదీ గురువారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధన బోధించే వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

కాలేజీకి వచ్చే విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించలేకపోతున్నారని, క్లాస్ రూముల్లో సైతం మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు, అధ్యాపకులు విలువైన సమయాన్ని చదువుపై దృష్టి సారించే వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించే ముఖ్యమైన సమావేశాల్లో మంత్రులు, అధికారులు మొబైల్ ఫోన్లు తీసుకరావొద్దనే నిబంధన విధించిన సంగతి తెలిసిందే. 
Read More : మెడను చుట్టిన కొండచిలువ.. వీడియో వైరల్