జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం 

  • Publish Date - December 4, 2019 / 06:07 AM IST

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం (డిసెంబర్ 4)ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్  శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లు ఈ వారంలోనే వేశపెట్టనుంది.  

పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బిల్లు ప్రవేశపెడతారని సమాచారం. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోక్ సభ, రాజ్యసభల్లో  సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆయన మంత్రి రాజ్ నాథ్ సింగ దిశానిర్దేశం చేశారు.
 
బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. భారత్‌లో 11 ఏళ్లు తప్పనిసరిగా నివసించి ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. దానిని ఇప్పుడు ఆరేళ్లకు తగ్గించినట్లు సమాచారం. 1955నాటి పౌరసత్వ బిల్లు స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.