Central Government announced Bharat Ratna to Five People this year
Bharat Ratna 2024 : మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏదైన రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం ఇది. 1954 జనవరి 2న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డును ప్రారంభించారు. కాగా.. ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను కేంద్రం ప్రకటించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌లకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ను ప్రకటించగా.. తాజాగా శుక్రవారం మరో ముగ్గురికి ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది.
తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. మొత్తంగా ఈ ఏడాది ఐదుగురు ఎల్‌కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్, పీవీ నరసింహారావు, చరణ్ సింగ్,ఎంఎస్ స్వామినాథన్ లకు దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని ప్రకటించింది.
Viral Video : బస్‌లో గొడవ.. చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. సీటుకోసం మాత్రం కాదు..
ప్రతి ఏటా ఇస్తారా?
ప్రధాన మంత్రి నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తులను సిఫారసు చేస్తారు. ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఇస్తారు. అయితే.. దీనికి పరిమితి ఏమీ లేదు. అలాగే ప్రతి ఏటా అవార్డు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. 1999లో నలుగురికి ప్రధానం చేశారు. అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురిని మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించారు. కాగా.. ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఎల్‌కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.
భారతరత్న గ్రహీతలకు ఏం ఇస్తారంటే?
రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, ఓ మెడల్‌ను భారతరత్న గ్రహీతలకు అందజేస్తారు. రావి ఆకు రూపంలో ఉన్న మెడల్‌పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ ఉంటుంది. దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనకవైపు భారత జాతీయచిహ్నం, సత్యమేవ జయతే అనే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. వీరికి ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు. అయితే.. ప్రత్యేక ప్రాధాన్యం, సదుపాయాలు వంటివి ఉంటాయి.
Haldwani Violence : ఉత్తరాఖండ్‌లో చెలరేగిన హింస.. నలుగురు మృతి, వందల మందికి గాయాలు..