Viral Video : బ‌స్‌లో గొడ‌వ‌.. చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు.. సీటుకోసం మాత్రం కాదు..

ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో ఇటీవ‌ల మ‌హిళ‌లు కొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి.

Viral Video : బ‌స్‌లో గొడ‌వ‌.. చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు.. సీటుకోసం మాత్రం కాదు..

Women slipper each other on bus in Bengaluru

Updated On : February 8, 2024 / 10:43 PM IST

ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో ఇటీవ‌ల మ‌హిళ‌లు కొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. ప‌క్క‌న జ‌నాలు ఉన్నారు, చూస్తున్నారు అనే విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా సిగపట్లు పడుతున్నారు. కొంద‌రు మ‌రింత ముందుకు వెళ్లి చెప్పుల‌తో కొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న‌నే క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. ఆర్టీసీ బ‌స్సులో ఇద్ద‌రు మ‌హిళ‌లు బూట్ల‌తో ఒక‌రినొక‌రు కొట్టుకున్నారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బ‌స్సులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క‌దులుతున్న‌ బ‌స్‌లో ముందు సీటులో కూర్చున్న మ‌హిళ‌, వెనుక సీటులో కూర్చున్న మ‌హిళ‌ల‌కు మ‌ధ్య విండో గ్లాస్ విష‌యంలో గొడ‌వ ప్రారంభ‌మైంది. చిన్న‌గా ప్రారంభ‌మైన గొడ‌వ చివ‌ర‌కు చెప్పులు తీసుకుని కొట్టుకునే స్థాయికి వెళ్లింది.

Viral Video : ఏమన్నా ఐడియానా? సైకిల్ టైర్‌తో డైనింగ్ టేబుల్

బ‌స్ ర‌ష్‌గా ఉన్న‌ప్ప‌టికీ ఒక్క‌రు కూడా వారిని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఆఖ‌ర‌కు బ‌స్ కండ‌క్ట‌ర్ క‌లుగ‌జేసుకుని ఇద్ద‌రిని విడ‌దీయ‌డం వీడియోలో క‌నిపించింది.కాగా.. ఈ ఘ‌ట‌న ఎప్పుడు జ‌రిగింది అన్న విష‌యాలు తెలియ‌రాలేవు. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.