Bullet Train: కేవలం 3.5 గంటల్లోనే ఢిల్లీ టు వారణాసి.. యూపీకి తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ-వారణాసి మధ్య ప్రయాణ సమయాన్ని 3.5 గంటలకు తగ్గించే నార్తర్న్ బుల్లెట్ రైలు(Bullet Train) కారిడార్‌ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

central government given green signal for Delhi-Varanasi bullet train project.

Bullet Train: భారతదేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అయిన ‘ఢిల్లీ-వారణాసి నార్తర్న్ బుల్లెట్ రైలు కారిడార్’కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Bullet Train) శనివారం వివరాలను వెల్లడించారు. దేశంలో రవాణా రంగాన్ని ఆధునీకరిస్తూ ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించేందుకే ఈ కారిడార్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Bank Holidays: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. నవంబర్ లో భారీగా సెలవులు.. ఈ వివరాలు తెలుసుకోండి మరి!

గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం.. 3.5 గంటల్లోనే ఢిల్లీ నుంచి వారణాసికి:

ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఢిల్లీ నుంచి వారణాసి మధ్య పడుతున్న 10 నుండి 12 గంటల ప్రయాణ సమయం కేవలం 3 గంటల 33 నిమిషాలకు తగ్గిపోనుంది. అలాగే ఢిల్లీ నుంచి ఆగ్రాకు 59 నిమిషాలు, కాన్పూర్‌కు గంటన్నర, లక్నోకు 2 గంటల 12 నిమిషాల్లో చేరుకోవచ్చు. వారణాసి నుండి లక్నోకు గంటన్నర, ప్రయాగ్‌రాజ్‌కు 33 నిమిషాలు, పాట్నాకు కేవలం 1 గంట మాత్రమే పడుతుందని రైల్వే మంత్రి వివరించారు. ఈ కారిడార్ వల్ల ఉత్తర భారత్‌లోని ముఖ్య ఆధ్యాత్మిక, వ్యాపార నగరాల మధ్య అనుసంధానత పెరిగి ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

మధ్యతరగతికి అందుబాటులో టికెట్ ధరలు.. విమాన ఛార్జీల కంటే చౌకగా ప్రయాణం:

హై-స్పీడ్ రైలు సేవలు కేవలం ధనికుల కోసమేనన్న అపోహలను రైల్వే మంత్రి తోసిపుచ్చారు. బుల్లెట్ రైలు టికెట్ ధరలు విమాన ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పూర్తిగా అందుబాటు ధరల్లోనే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలు రైతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వార ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.